లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా కాజల్ అగర్వాల్ అలాగే రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ హీరోయిన్స్ తో మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న మాసివ్ పాలన్ ఇండియా చిత్రం “ఇండియన్ 2”. మరి తమ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ చిత్రం ఇండియన్ కి సీక్వెల్ గా చాలా ఏళ్ల తర్వాత చేస్తున్న ఈ చిత్రంపై ఇప్పుడు అనేక అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఈ సినిమా ఓటిటి డీల్ కి సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ ఇపుడు తెలుస్తుంది. దీనితో ఈ చిత్రానికి అయితే దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు రికార్డు మొత్తం ఆఫర్ ని ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రానికి ఏకంగా 200 కోట్లకి పైగానే ఓ మాసివ్ డీల్ ని నెట్ ఫ్లిక్స్ వారు ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇది లాక్ అయితే ఇండియన్ సినిమా దగ్గరే ఓ బిగ్గెస్ట్ డీల్స్ లో ఒకటి అని చెప్పాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.