ఓటిటిలో “దళపతి 67” కి భారీ ఆఫర్.?

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా ప్రస్తుతం రష్మికా మందన్నా తో “వరిసు” చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ని మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత అయితే విజయ్ మళ్ళీ తన క్రేజీ కాంబో మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో చేయనున్నాడు. మరి ఇది విజయ్ కెరీర్ లో 67వ సినిమాగా తెరకెక్కిస్తుండగా దీనిపై ఇప్పుడు నుంచే అనేక అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ భారీ సినిమాపై వచ్చే డిసెంబర్ లో ఓ బిగ్ అప్డేట్ రానుండగా ఇప్పుడు అయితే ఓ క్రేజీ టాక్ లేటెస్ట్ గా తెలుస్తుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు ఆల్రెడీ అయితే దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు రికార్డు ధర చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా ఇపుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ధర కూడా ఈజీగా 100 కోట్ల పైమాటే అని కోలీవుడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఈ కాంబో పై ఆల్రెడీ భారీ హైప్ ఉంది. ఇక షూట్ స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version