‘ది ప్యారడైజ్’కి భారీగా ఓటీటీ డీల్ ?

న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ హిట్‌ గా నిలిచిన ‘దసరా’ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ఓవర్‌ నైట్‌ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌ గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే, విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ బజ్‌ని సృష్టించింది. దీంతో, ఇంకా ఈ సినిమా ప్రారంభం కాకుండానే 65 కోట్లకు కాస్త అటు ఇటుగా ఓటీటీ హక్కుల డీల్ కుదిరిపోతోందిని టాక్ నడుస్తోంది.

పైగా ఈ సినిమా ఆడియో రైట్స్ 18 కోట్లకు సెట్ అయిందని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో చూడాలి. కాగా పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో మాస్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుందట సినిమా. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే కథానాయికను ఇంకా ప్రకటించలేదు. కాగా ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version