అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ రాగా, చిత్ర యూనిట్ ట్రైలర్ ను పలు హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ ఈ ట్రైలర్ కి 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. అంతేకాక 650కే కి పైగా లైక్స్ తో ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది.
సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్, a+s పతాకాల పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ, అనీష్ యోహన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. జూన్ 3 వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


