అజిత్ “గుడ్ బ్యాడ్ అగ్లీ” సెకండ్ లుక్ కి సెన్సేషన్ రెస్పాన్స్!

అజిత్ “గుడ్ బ్యాడ్ అగ్లీ” సెకండ్ లుక్ కి సెన్సేషన్ రెస్పాన్స్!

Published on Jun 29, 2024 12:01 AM IST

ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్, కోలీవుడ్ స్టార్ హీరో అయిన అజిత్ కుమార్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుండి నిన్న సెకండ్ లుక్ ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ లుక్ కి ఆడియెన్స్, ఫ్యాన్స్ నుండి సెన్సేషన్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఈ లుక్ కి మొత్తంగా 62 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లోకి రానున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు