Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’కి అక్కడ సాలిడ్ రెస్పాన్స్!


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లాస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సై ఫై మూవీలో ప్రభాస్ పర్ఫార్మెన్స్ టెర్రిఫిక్‌గా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఈ సినిమాకు ఇండియన్ ఫ్యాన్స్‌తో పాటు ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. ‘కల్కి 2898 AD’ చిత్రానికి ఓవర్సీస్‌లోనూ సాలిడ్ రెస్పాన్స్ రావడంతో, అక్కడ పలు కొత్త రికార్డులను క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇక తాజాగా ఈ చిత్రాన్ని బుసాన్ ఫిలిం ఫెస్టివల్ 2024లో ప్రదర్శించారు. ఈ సినిమాకు అక్కడి ఆడియెన్స్ మంత్రముగ్ధులయ్యారు. ఈ సినిమాను చూసి వారు పూర్తిగా ఎంజాయ్ చేయడంతో, వారు సాలిడ్ రెస్పాన్స్ ఇచ్చారు.

ఇలా ‘కల్కి 2898 AD’ మూవీ ఇంకా ఏదో ఒక చోట సందడి చేస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version