స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. అయితే, ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాకు బుక్ మై షోలో ఏకంగా 150K ఇంట్రెస్ట్‌లు రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతమేర ఆసక్తి నెలకొందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ సినిమాలో అందాల భామలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు సమర్పణలో ఈ చిత్రాన్ని శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.