‘టాక్సిక్’ మూవీలో మ‌రో హీరోయిన్.. ఎవ‌రంటే?

‘టాక్సిక్’ మూవీలో మ‌రో హీరోయిన్.. ఎవ‌రంటే?

Published on Jun 27, 2024 1:00 AM IST

‘కేజీఎఫ్’ మూవీతో క‌న్న‌డ హీరో య‌శ్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేశాడో అంద‌రికీ తెలిసిందే. రాఖీ భాయ్ పాత్ర‌లో త‌న న‌ట‌న‌తో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు ఈ హీరో. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా వ‌చ్చిన ‘కేజీఎఫ్-2’ తో ఇండియన్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కురిపించాడు. ఇప్పుడు ‘టాక్సిక్’ అనే సినిమాను రెడీ చేస్తున్నాడు య‌శ్.

ఈ సినిమాను పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఈ సినిమాలో అందాల భామ కియార అద్వాని హీరోయిన్ గా న‌టించ‌నుంది. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ కూడా జాయిన్ కానుందట‌. బాలీవుడ్ లో ప‌లు సినిమాల్లో న‌టించి మెప్పించిన హుమా ఖురేషి, ‘టాక్సిక్’ మూవీలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంద‌ట‌.

అయితే, ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండ‌బోతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను గీతూ మోహ‌న్ దాస్ డైరెక్ట్ చేస్తుండ‌గా వెంక‌ట్ కె నారాయ‌ణ‌తో క‌లిసి య‌శ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10, 2025లో రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు