పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఎడి” ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులతో చరిత్ర సృష్టిస్తోంది. దీనికితోడు థియేటర్స్ లో ఈ భారీ సినిమాకి పోటీ లేకపోవడంతో భారీ వసూళ్లు వస్తున్నాయి. ఐతే, హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పీవీఆర్ మాల్లో కల్కి సినిమా వీక్షించడానికి వచ్చినవారికి చేదు అనుభవం ఎదురు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
థియేటర్ లోపల వర్షపు నీరు పడుతుండటంతో యాజమాన్యం వెంటనే సినిమాను నిలిపేసింది. దీంతో ప్రేక్షకులు అసహననానికి లోనయ్యారు. అసలు థియేటర్లో వర్షం నీరు పడుతుండటం ఏమిటి ?, నిర్వాహకులు షో నిలిపివేయడం ఏమిటి ? అంటూ నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. ఐతే, వర్షం నీరు లీక్ కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉందని, అందుకే వెంటనే షోను నిలిపివేశామని యాజమాన్యం తెలిపింది.