లేటెస్ట్ గా టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి తాలుకా కొత్త లుక్ సోషల్ మీడియాలో మంచి వైరల్ అయ్యింది. టాలీవుడ్ లేటెస్ట్ టాలెంటెడ్ కమెడియన్ వైవా హర్షతో కలిపి ఉన్న సెల్ఫీలో ఫ్రెష్ లుక్ తో కనిపించి ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు చిరు ప్రిపేర్ చేసిన ఈ న్యూ లుక్ ఎందుకో రివీల్ అయ్యింది.
మన తెలుగు మొట్ట మొదటి స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో స్టార్ హీరోయిన్ సమంతా తో ప్లాన్ చేసిన బిగ్గెస్ట్ సెలెబ్రెటీ షో “సామ్ జామ్” కు గాను చిరు ఈ లుక్ కు వచ్చారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ కు సంబంధించి మరిన్ని ఫోటోలు బయటకొచ్చాయి. సమంతా మరియు చిరు కలిసి ఉన్న ఈ ఎపిసోడ్ కోసం చర్చ మొదలయ్యింది.
ఆహా లో ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు. మామూలుగానే చిరు ఇలాంటి వాటిలో మంచి ఎనర్జిటిక్ గా పాల్గొంటారు. మరి ఈసారి సమంతా లాంటి హోస్ట్ తో ప్లాన్ చేసిన ఈ మెగా ఎపిసోడ్ ఎలా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ వీటి కోసం ఉంటుంది అని ఓ రకమైన ఉత్కంఠ మొదలయ్యింది. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.