నా ఫేవరెట్ హీరోయిన్ నే పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంది – వరుణ్ తేజ్

నా ఫేవరెట్ హీరోయిన్ నే పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంది – వరుణ్ తేజ్

Published on Feb 6, 2024 11:30 PM IST

యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీని మార్చి 1న తెలుగు, హిందీ భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు మేకర్స్.

ఇక నేడు ఈ మూవీ నుండి గగనాల అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ఒక కాలేజ్ ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు వరుణ్. మీరు ఇప్పటివరకు చాలా సినిమాలు చేసారు కదా, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు వరుణ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

నిజానికి నా ఫేవరెట్ హీరోయిన్ అయిన లావణ్యని నేను వివాహం చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అలానే తనకు సాయి పల్లవి అంటే కూడా ఎంతో ఇష్టం అన్నారు. ఇక లావణ్యకు తానే మొదట ప్రేమని ప్రపోజ్ చేసానని అన్నారు. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డారని, తప్పకుండా రిలీజ్ అనంతరం మూవీ అందరినీ ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వరుణ్ తేజ్ వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు