బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కి అవార్డుల విషయంలో కొదవలేదు. ఆయన నటించిన ప్రతీ ఏడాది ఆ సినిమాకు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు అవార్డునివ్వడం ప్రతీతి. అయితే తొలిసారిగా అతను నటించిన సినిమా ఫిలిం ఫేర్ లో చోటు సంపాదించుకోకపోవడంతో బాలీవుడ్ లో ఇప్పుడు ఇది హాట్ న్యూస్ గా మారింది.
విషయానికొస్తే షారుఖ్, ఫర్హాన్ కాంబినేషన్ లో గత ఏడాది విడుదలైన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాకి కలెక్షన్లు వచ్చినా విమర్శకుల నుండి చుక్కెదురయింది. ఇప్పుడు ఈ సినిమాకి గానూ ఉత్తమ నటుడి జాబితాలో ఫిలిం ఫేర్ లిస్ట్ లో షారుఖ్ పేరు లేకపోయేసరికి షారుఖ్ ఈ విధంగా స్పందించాడు. “హ్యాపీ న్యూ ఇయర్ కలెక్షన్ లను తెచ్చిపెట్టింది గానీ అందులో నా నటన అంత అవార్డు అందుకోదగ్గ నటన ప్రదర్శించలేదేమో.. గతఏడాది నాకంటే బాగా నటించిన వాళ్ళు ఏడుగురో.. డబ్బై మందో వున్నారు” అని తెలిపాడు.


