సంధ్య థియేటర్ తొక్కిసలాటపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్ తాజాగా ప్రెస్ మీట్లో స్పందించాడు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని.. ప్రజలు ఇది అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. గత మూడేళ్లుగా తాము ఎంతో కష్టపడి చేసిన సినిమాను అభిమానులతో కలిసి చూడాలని ఎంతో ఆశపడ్డానని ఆయన తెలిపారు.
అయితే, తానేదో బాధ్యతారహితంగా వ్యవహరించినట్లు వ్యాఖ్యలు రావడం బాధాకరం అని బన్నీ చెప్పుకొచ్చాడు. తన సినిమాను థియేటర్లలో అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ తాను మాత్రం తన సినిమాను చూసుకోలేకపోయానని బాధపడుతున్నట్లు తెలిపారు. దేశం మొత్తం తన సినిమాను పండగా జరుపుకుంటున్నారు. కానీ, తాను మాత్రం చాలా లోగా ఉన్నట్లు ఆయన తెలిపారు.