ఇకనైనా ఆపండి.. సీనియర్ హీరోయిన్ సీరియస్

సీనియర్‌ హీరోయిన్ సిమ్రన్‌ పై సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో సిమ్రన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ఇప్పటివరకూ నేను నిశ్శబ్దంగా ఉన్నాను. ఇకనైనా నా పై తప్పుడు వార్తలు రాయడం ఆపండి. మీకు ఇప్పుడు మళ్లీ స్పష్టం చేస్తున్నా. ఏ పెద్ద హీరోతోనూ పనిచేయాలనే కోరిక నాకు లేదు. ఇప్పటికే వారితో చాలా సినిమాల్లో చేశా. ఇప్పుడు నా లక్ష్యాలు చాలా భిన్నంగా ఉన్నాయి.

అలాగే, నా పరిమితులు నాకు తెలుసు. ఒకరితో లేదా మరొకరితో ముడిపెడుతూ ఇన్నేళ్లుగా నాపై సోషల్‌ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉన్నా నేను చాలా సైలెంట్‌గా ఉన్నాను. నాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. దానికే నా మొదటి ప్రాధాన్యత. STOP.. ఇది చాలా శక్తివంతమైన పదం. కాబట్టి, ఇకనైనా తప్పుడు ప్రచారాలు ఆపండి అని చెబుతున్నా. నా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోన్న వారు నాకు వెంటనే క్షమాపణలు చెప్పాలి’’ అని సిమ్రన్‌ సీరియస్ అయ్యారు.

Exit mobile version