పవన్ కళ్యాణ్, నేను భార్యాభర్తలుగా విడిపోయినా, తల్లిదండ్రులుగా ఇప్పటికి కలిసే ఉన్నాము. ప్రతి రోజు ఫోనులో మాట్లాడుకుంటాం అని అన్నారు రేణు దేశాయ్. ఇద్దరు పిల్లలు అకిరా నందన్, ఆధ్యాలకు తల్లిదండ్రులుగా మేము, మా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాం. మంచి స్నేహితులుగా కలిసే ఉన్నాం. నా జీవితంలో ఎం జరుగుతుందో పవన్ కళ్యాణ్ కు తెలుసు అని రేణు దేశాయ్ వ్యాఖ్యానించారు.
ఇటివల కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో పవన్ మంచి తండ్రి కాదంటూ విమర్శలు చేయడంతో రేణు దేశాయ్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చేసిన ఈ వ్యాఖ్యలతో పవన్ తో సంబంధంపై అభిమానులకు, ప్రేక్షకులకు మరింత క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది.