ఇంటర్వ్యూ : లక్ష్మీ మంచు – లిసా స్మిత్ పాత్ర కోసం చాలా రీసర్చ్ చేసాను.!

Manchu-Lakshmi

కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైననప్పటికీ నిర్మాతగా సినిమాలపై తనకున్న ఫాషన్ తో, నటిగా తన టాలెంట్ తో అనతి కాలంలోనే తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంది. లక్ష్మీ మంచుని నటిగా ఓ మెట్టు పైకి ఎక్కిన్చేలా ఉంటుంది అంటున్న ‘చందమామ కథలు’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మీతో కాసేపు ముచ్చటించి సినిమా విశేషాలను, తన తదుపరి చేయబోతున్న సినిమాల గురించి తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘చందమామ కథలు’కి ప్రీ రిలీజ్ క్రేజ్ ఎలా ఉంది?

స) చందమామ కథలుకి బయట క్రేజ్ చాలా బాగుంది. ఈ విషయంలో నేను మీడియా వారికి థాంక్స్ చెప్పాలి. నేను సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను. నా పాత్ర అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.

ప్రశ్న) ‘చందమామ కథలు’లో ఈ పాత్రని మీరు ఒప్పుకోవడానికి గల కారణం ఏమిటి?

స) నేను ఏరోజైతే ఈ స్క్రిప్ట్ విన్నానో అప్పుడే ఈ సినిమా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాను. తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా ఎవరో ఒకరు ఇలాంటి పాత్రలు చేస్తుంటారు. ఈ సినిమా నుంచి నేను రెగ్యులర్ పాత్రలకి ఈ సినిమాతో బ్రేక్ ఇచ్చి రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమాలనే చేయాలనుకుంటున్నాను.

ప్రశ్న) మీ పాత్ర గురించి చెప్పండి?

స) నేను ఈ సినిమాలో లిసా స్మిత్ అనే సూపర్ మోడల్ పాత్ర చేసాను. నా పాత్ర చాలా సార్లు కింద పడడం, పైకి లేవడం జరుగుతుంది. ఉంటాయి. కింద పడిన ప్రతి సారి ఎలా ఫైట్ చేసి పైకి వచ్చిందనేదే నా పాత్ర కథ.

ప్రశ్న) ఈ సినిమాలో మొత్తం 8 కథలు ఉన్నాయి. ఒకదానితో ఒకటి కనెక్షన్ ఉంటుందా?

స) ఉంటుంది. ఒకానొక సందర్భంలో అన్ని కథలకి కనెక్షన్ ఉంటుంది.

ప్రశ్న) ఈ సినిమాలో మీరు సిగరెట్ తాగడం, మందు తాగడం లాంటి సీన్స్ ని ఎలా మేనేజ్ చేయగలిగారు?

స) స్వతహాగా నాకు స్క్రీన్ పై స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి చూపించడం ఇష్టం లేదు. కానీ నా పాత్ర డిమాండ్ చేయడంతో ఒక ప్రొఫెషనల్ యాక్టర్ గా చేసాను. అలాగే నా పాత్ర కోసం నేను చాలా రీసర్చ్ చేసి ప్రిపేర్ అయ్యాను. నేను చాలామంది స్మోక్, డ్రింక్ చేసే మహిళను చూసి అర్ధం చేసుకొని, అదే పొజిషన్లో నేను ఉంటే ఎలా చేస్తానో అలా ఈ పాత్రని చేసాను.

ప్రశ్న) మీ నాన్నగారైన డా. మోహన్ బాబు ఈ సినిమాని చూసారా?

స) లేదు.. ఇంకా చూడలేదు. త్వరలోనే చూపించాలని అనుకుంటున్నాను. ఈ సినిమాలో నా బోల్డ్ రోల్ చూసి ఆయన ఎలా రియాక్ట్ అవుతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

ప్రశ్న) వరుసగా సినిమాలు చేయకుండా ఎందుకు సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు?

స) నాకు వచ్చిన పాత్ర మొదట నాకు నచ్చాలి, అప్పుడే చేస్తాను. నా దగ్గరికి వచ్చిన పాత్రలన్నీ చేయాలని నేను అనుకోవడం లేదు. నా దగ్గరికి వచ్చే పాత్ర చాలా బాగుంది, చాలెంజింగ్ గా ఉంది అనుకుంటేనే ఆ పాత్ర చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను.

ప్రశ్న) రాజకీయాలపై మీ అభిప్రాయం ఏమిటి? అలాగే మీరు రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలపై ఈ కామెంట్ ఏంటి?

స) మీరన్నది నిజమే.. నన్ను చాలా రాజకీయ పార్టీలు రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించాయి. నాకు కూడా రాజకీయాలంటే ఇష్టం. కానీ నేను రాజకీయాల్లోకి రావడానికి ఇది సరైన సమయం కాదు. ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను.

ప్రశ్న) మీరు భవిష్యత్తులో చేయనున్న సినిమాల విశేషాలు చెప్పండి?

స) నేను చేస్తున్న ఒక షార్ట్ ఫిల్మ్ షూటింగ్ పూర్తి చేసాను. అది ఎలక్షన్స్ పూర్తైన తర్వాత రిలీజ్ అవుతుంది. అది కాకుండా నేను చేయనున్న సినిమాలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను.

అంతటితో లక్ష్మీ మంచుకి అల్ ది బెస్ట్ చెప్పి ఇంటర్వ్యూని ముగించాము.

 

CLICK HERE FOR ENGLISH INTERVIEW

Exit mobile version