రవితేజ గారిని వందేళ్లైనా మర్చిపోలేను : మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో

Published on Dec 5, 2022 11:38 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ధమాకా. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫి అందించారు. చాలా గ్యాప్ తరువాత మరొక్కసారి రవితేజ ఈ మూవీలో తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ఫ్యాన్స్, ఆడియన్స్ ముందుకి రానున్నారు. డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ లో రూపొందిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. కాగా ధమాకా ఈనెల 23న గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మూవీ గురించిన అనుభవాలు ప్రత్యేకంగా మీడియాతో పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ, మాస్ మహారాజ రవితేజ గారు తనని నమ్మి ఏకంగా రెండు మూవీస్ ఛాన్స్ ఇచ్చారని, ఆయనని వందేళ్లైనా మర్చిపోలేనని తెలిపారు. ఆయన తనని ఎంతో ప్రోత్సహించడంతో పాటు కాన్ఫిడెన్స్ ని కూడా అందించారని అన్నారు. ఇక ఈ మూవీలో మొత్తంగా ఐదు సాంగ్స్ ఉంటాయని, త్వరలోనే తాను స్వయంగా రాసి పాడిన ఐదవ పాట ని కూడా రిలీజ్ చేస్తామని, ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని పాటలకి యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ రావడం పట్ల భీమ్స్ ఆనందం వ్యక్తం చేసారు. ఇక మూవీ ఒక పవర్ ప్యాక్డ్ ఫిలిం అని, డైరెక్టర్ త్రినాధరావు మూవీ ఆద్యంతం అందరినీ ఆకట్టుకునేలా రూపొందించారని, మాస్ మహారాజా రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ మూవీకి హైలైట్ అని తెలిపారు. మరి డిసెంబర్ 23న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న ధమాకా ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :