‘వీరసింహారెడ్డి’ని ఒక బాధ్యతగా చేశా. మేము ఊహించినదాని కంటే పెద్ద విజయం సాధించింది – దర్శకుడు గోపీచంద్ మలినేని ఇంటర్వ్యూ

‘వీరసింహారెడ్డి’ని ఒక బాధ్యతగా చేశా. మేము ఊహించినదాని కంటే పెద్ద విజయం సాధించింది – దర్శకుడు గోపీచంద్ మలినేని ఇంటర్వ్యూ

Published on Jan 14, 2023 3:01 AM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని భారీ స్థాయిలో నిర్మించారు. నిన్న గ్రాండ్ గా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన వీరసింహారెడ్డి ప్రస్తుతం మంచి సక్సెస్ఫుల్ టాక్ తో కొనసాగుతోంది. కాగా ఈ మూవీ సక్సెస్ పట్ల తన విజయానందాన్ని పంచుకున్నారు గోపీచంద్ మలినేని.

ఈ మూవీ సక్సెస్ ని ఎలా ఎంజయ్ చేస్తున్నారు?

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారితో ఈ సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఇటీవల రిలీజ్ అయిన అఖండ సినిమా మంచి విజయం అందుకోవడం తో పాటు ఆపైన ఆయన హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో కూడా అందరి నుండి మంచి క్రేజ్ సొంతం చేసుకుని దూసుకెళ్లడం ఆనందదాయకం. ఇటువంటి టైం లోనే నాకు సినిమా చేసే అవకాశం రావడం పట్టరాని సంతోషంగా అనిపంచింది. అందుకే ఆయనతో సినిమా చేయాలని వచ్చిన ఈ అవకాశాన్ని ఒక బాధ్యత గా తీసుకుని ఒక అభిమానిగా ఎంతో కష్టపడి సినిమా తీసాను. సినిమాలో బాలకృష్ణ గారి సూపర్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో పాటు ఇంటర్వెల్ లో ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకున్న సీన్స్ అందరి మదిని తాకుతున్నాయి. అలానే సెకండ్ హాఫ్ లో ఆయన మరింతగా ఆకట్టుకునేలా నటించారు. ఇంతటి గొప్ప అవకాశం రావడం, అలానే రిలీజ్ అనంతరం సినిమాని అందరూ ఇంతలా ఆదరిస్తూ ఉండడం చెప్పలేనంత సంతోషంగా ఉందని అన్నారు.

 

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ కి మంచి అప్లాజ్ వస్తోంది కదా వారి గురించి చెప్పండి ?

నాకు ప్రత్యేకంగా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ తో మంచి అనుబంధం ఉంది. రవితేజ గారి క్రాక్ మూవీ మొత్తం ఫైట్స్ వాళ్ళే చేసారు. ఇక ఈమూవీ విషయంలో మరింతగా శ్రద్ధ తీసుకుని చేసారు. వాళ్ళు ఫైట్స్ కంపోజ్ చేస్తే ఆ సందర్భం యొక్క ఎమోషన్ స్క్రీన్ పై ఎలివేట్ అవడంతో పాటు ఫైట్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది, అటువంటి వారితో మళ్ళి మళ్ళి వర్క్ చేయాలనిపిస్తుంది.

 

బాలకృష్ణ గారి లుక్ ఈ మూవీ కోసం ఎలా డిజైన్ చేసారు ?

నిజానికి ఆయన అభిమానిగా మొదటి నుండి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఈ సినిమాలో మరింత అద్భుతంగా ఆయనని చూపించాలని అనిపించింది. ఎంతో ఆలోచన చేసిన అనంతరం డిఫరెంట్ గా బ్లాక్ కలర్ షర్ట్ లో పవర్ఫుల్ లుక్ లో ఉన్న లుక్ డిజైన్ చేసి దానినే ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేసాము. దానికి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. ఇక సహజంగానే ఎంతో గొప్ప అందంగా ఉండే బాలకృష్ణ గారిని మరింత అందంగా చూపించాలనే ఆలోచనతో ఆ పాత్ర తాలూకు లుక్స్, కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఈ రోజున ఏ థియేటర్ దగ్గర చూసినా బాలకృష్ణ గారి బ్లాక్ కలర్ లుక్స్, బ్లాక్ కళ్లద్దాల స్టిల్స్ పడుతుంటే ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ వస్తోంది. ఆయన దానిని ఓన్ చేసుకుని నటించడంతో అది సిగ్నేచర్ స్టిల్ అవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

 

సిస్టర్ సెంటిమెంట్ ఇంత బాగా వర్కౌట్ అవుతుందని ఊహించారా ?

ముఖ్యంగా వీరసింహారెడ్డి మూవీ బలమైన కథని నమ్మి తీసిన సినిమా. ఇక సిస్టర్, బ్రదర్ సెంటిమెంట్ లో ఉన్న ఎమోషన్ కనుక బాగా పండితే తప్పకుండా ఆడియన్స్ దానిని ఓన్ చేసుకుంటారు అనే నమ్మకంతో చేసాము. ముఖ్యంగా సినిమాలో కీలకమైన ఆ అంశం బాగా పండడం, అలానే అన్న చెల్లెళ్ళ పాత్రలో నటించిన బాలకృష్ణ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు అద్భుతంగా నటించడంతో పలు ఎమోషనల్ సన్నివేశాల్లో ఆడియన్స్ కూడా కంటతడి పెట్టుకుంటూ పాత్రలని ఓన్ చేసుకుంటున్నారు. అదే మా నిజమైన విజయం. ఇక చెల్లెలి పాత్ర కోసం మొదట వరలక్ష్మి ని అనుకున్నపుడు బాలకృష్ణ గారు కూడా వెంటనే ఓకే చేసారు. క్రాక్ సినిమాలో ఆమె నటన ఆయనకు ఎంతో బాగా నచ్చింది. ఇక ఈ మూవీలో యాంటీ సిస్టర్ సెంటిమెంట్ ఉన్న పాత్రలో ఆమె జీవించారు అనే చెప్పాలి. అందుకే ఆడియన్స్ నుండి కూడా ఆ పాత్రకు ఎంతో అప్లాజ్ వస్తోంది.

ఈ మూవీలో డైలాగ్స్ కి కూడా బాగా పేరు వస్తోంది, ముఖ్యంగా కొన్ని పొలిటికల్ డైలాగ్స్ వాడారు కదా, వాటి గురించి చెప్పండి ?
నిజానికి డైలాగులన్నీ కూడా కథ ప్రకారం వచ్చినవి, అలానే కథ యొక్క సందర్భాన్ని బట్టి రాసినవే. అంతేతప్ప కావాలని రాసినవి ఏమి లేవు. అవి ఎంతో సహజంగా ఉన్నాయి కాబట్టే కదా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

 

క్రాక్ మూవీ తరువాత మీ అబ్బాయి ఇందులో చక్కగా నటించాడు, తన గురించి ?

వీరసింహారెడ్డి పాత్రని మరోసారి ఎలివేట్ చేస్తూ కొనియాడే పిల్లాడి పాత్ర ఒకటికావాలి. అప్పుడే నా మదిలోకి నా కొడుకు వచ్చాడు. అందుకే తనని ఆ పాత్ర కోసం తీసుకున్నాం.

 

సెకండ్ హాఫ్ లో రెండు కీలక సీన్స్ లో బాలకృష్ణ గారి డైలాగ్స్ ఉండవు, కానీ కేవలం ఎమోషన్స్ తో వాటిని ఎలా బ్యాలెన్స్ చేసారు ?

బాలకృష్ణ గారి పెర్ఫార్మన్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ అనేది అందరికీ తెలిసిందే. ఆ విధంగా ఆ రెండు సీన్స్ లో సూపర్ ఎమోషన్స్ తో అదరగొట్టారు. అందుకే అందరి నుండి ఆ సీన్స్ కి మరింత పేరు లభిస్తోంది.

 

బోయపాటి తరువాత అంత అద్భుతంగా బాలకృష్ణ గారిని స్క్రీన్ పై పవర్ఫుల్ గా చూపించింది మీరే అనే అప్లాజ్ వస్తోంది కదా, ఆయనకి పెద్ద ఫ్యాన్ అవడం వల్లనే అలా చూపించగలిగారా ?

నిజానికి నా అభిమాన నటుడిని ఎంతో గొప్పగా చూపించాలనే ఉద్దేశ్యంతోనే సినిమాని అంత గొప్పగా సిద్ధం చేసి తీసాను. అలానే నాలో కూడా మంచి మాస్ యాంగిల్ ఉంది, అందుకే అది స్క్రీన్ పై అలా వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఫ్యాన్ బాయ్ గా సెకండ్ హాఫ్ డైరెక్టర్ గా అలోచించి తీశాను. మొత్తంగా అయితే అందరూ శాటిస్ఫై అయితేనే కథ సినిమా సక్సెస్ అయ్యేది.

 

థమన్ గారి మ్యూజిక్ గురించి చెప్పండి ?

మా ఇద్దరికీ ఒకరి మీద మారొకరికి ఉన్న అవగాహన, ప్రేమ వేరు. నేను చేసిన అన్ని సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ వర్క్ చేయగా ఆర్ట్ డైరెక్టర్ గా ప్రకాష్, ఫైట్ మాస్టర్స్ గా రామ్ లక్ష్మణ్ వర్క్ చేసారు. నేను మనుషులని నమ్ముతాను, వాళ్ళని వదులుకోను. వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడే వారు. ముఖ్యంగా థమన్ అయితే నా సినిమాలకు పడే కష్టం చాలా ఎక్కువ. నా ఆలోచనలు తనకు సెట్ అవుతాయి. పక్కాగా ఏదైతే అనుకుంటానో తను అంతకు మించేలా ట్యూన్స్, బీజీఎమ్ ఇస్తాడు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య గారి మాస్ స్టైల్ కి బీజీఎమ్ సరిపోవడం లేదని మరొక్కసారి లైవ్ వర్క్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజున ఈ మూవీ బీజీఎమ్ తో పాటు సాంగ్స్ అందరికీ నచ్చాయి అంటే థమన్ కష్టం ముఖ్య కారణం. ఇక ఫ్యాన్స్, ఆడియన్స్ అందరూ జై బాలయ్య సాంగ్ కి బ్రహ్మరథం పడుతున్నారు.

 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల గురించి ?

నా సినిమా కెరీర్ లో చేసిన బెస్ట్ ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళే. నేను రవితేజ గారితో క్రాక్ మూవీ చేస్తున్నప్పుడే నవీన్ గారు మాతో సినిమా చేయాలి అని చెప్పారు. ఆ విధంగా ఆ మూవీకి ముందే నన్ను వారు ఫిక్స్ చేసుకున్నారు అంటే వాళ్ళకి నా మీద ఎంత నమ్మకం ఉందొ అర్ధం అయింది. నిజంగా వాళ్లిద్దరూ ఎంతో మంచి నిర్మాతలు, ప్రతిదీ చక్కగా సినిమా కోసం సమకూర్చే వారు. ఇంత పెద్ద పండుగకి రెండు పెద్ద సినిమాలు బరిలో నిలుస్తున్నాయి అంటే వాటికి వచ్చే ప్రజర్స్ ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. కానీ అవన్నీ తట్టుకుని బ్యాలన్స్డ్ గా రెండు సినిమాలని రిలీజ్ చేయడం ఎంతో గొప్ప విషయం.

 

మీ తదుపరి ప్రాజక్ట్స్ ?

ప్రస్తుతం వీరసింహారెడ్డి సక్సెస్ ని ఫ్యాన్ గా ఎంజాయ్ చేస్తున్నా. అవి త్వరలోనే చెప్తాను

ఆల్ ది బెస్ట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు