బుల్లితెర పై అల్లు అర్జున్ హవా మామూలుగా లేదుగా!

Published on Mar 30, 2023 10:00 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాడు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు. పుష్ప పార్ట్ 1తో, ఐకాన్ స్టార్ దేశం మొత్తాన్ని శాసించాడు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఈ నటుడు ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. అలా వైకుంఠపురములో చిత్రం థియేటర్ల లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు

ఇటీవల టెలివిజన్‌లో ప్రసారమైన అల వైకుంఠపురములో 5.42 టీఆర్పీ రేటింగ్ సంపాదించి, బుల్లి తెరపై నటుడి క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, అల వైకుంఠపురములో చిత్రం తెలుగు లో అత్యధిక టీఆర్పీ (తొలి ప్రసారంలో – 29.4 టీఆర్పీ) సాధించిన చిత్రం. బన్నీ ప్రస్తుతం పుష్ప ది రూల్‌ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :