
విడుదల తేదీ : జనవరి 24, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్, మందిరా బేడి, అజు వర్గీస్, అర్చన కవి, అర్జున్ రాధాకృష్ణన్, కృష్ణ విజయ చంద్రన్ తదితరులు
దర్శకులు : అనాస్ ఖాన్, అఖిల్ పాల్
నిర్మాతలు : రాయ్ సి.జె, కొచుమోన్, రాజు మల్లియత్
సంగీతం : జేక్స్ బిజోయ్
ఛాయాగ్రహణం : అఖిల్ జార్జ్
కూర్పు : చమన్ చాక్కొ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్ లీడ్ రోల్స్‌లో నటించిన మలయాళ చిత్రం ‘ఐడెంటిటీ’ జనవరి 2న రిలీజ్ అయ్యింది. అయితే, 22 రోజుల తర్వాత ఇప్పుడు తెలుగు వెర్షన్‌లో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథ:
అమర్ ఫెలిక్స్(అర్జున్ రాధాకృష్ణన్) ఓ బట్టల దుకాణంలో పనిచేస్తుంటాడు. అక్కడికి వచ్చే ఆడవారిని ట్రయల్ రూమ్‌లో ఫోటోలు, వీడియోలు తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేసేవాడు. అయితే అతని దుకాణానికి గుర్తుతెలియని వ్యక్తి నిప్పంటిస్తాడు. దీంతో అమర్ మృతి చెందడం అలీషా అబ్దుల్ సలామ్(త్రిష) అనే జర్నలిస్ట్ చూస్తుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న అల్లెన్ జాకోబ్(వినయ్ రాయ్) అలీషాను ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్తాడు. ఈ క్రమంలో అల్లెన్ పక్కింట్లో ఉండే హరన్ శంకర్(టోవినో థామస్) ఒక స్కెచ్ ఆర్టిస్ట్‌ను కలుస్తాడు. హరన్ సహాయం తీసుకుని అలీషా చెబుతున్నట్లుగా హంతకుడి స్కెచ్ వేసేందుకు అల్లెన్ ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అల్లెన్ ఎలాంటి నిజాలు తెలుసుకుంటాడు..? ఈ కేసుతో హరన్‌కు ఎలాంటి సంబంధం ఉంది..? ఇంతకీ అలీషా ఎవరు..? అనేది ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
‘ఐడెంటిటీ’ సినిమాలోని సస్పెన్స్, ఊహించని ట్విస్ట్ లతో కూడిన నెరేషన్ ఆకట్టుకుంటుంది. దర్శకులు అఖిల్ పాల్, అనాస్ ఖాన్ ఈ కథను తీర్చిదిద్దన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వారు ఈ సినిమాలోని పాత్రలను, కథను నడిపిన తీరు బాగుంది.
టోవినో థామస్ మరోసారి చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతడి పాత్రను సినిమాలో ముందుకు తీసుకెళ్లిన విధానం బాగుంది. ఇన్వెస్టిగేటర్ పాత్రలో వినయ్ రాయ్ తగినంత టెన్షన్, డ్రామాను తీసుకొచ్చాడు.
ఈ సినిమా కథను ముందుకు తీసుకెళ్లడంతో త్రిష పాత్ర చాలా కీలకంగా సాగుతుంది. ఆమె పాత్రలో నటించిన తీరు బాగుంది. సినిమాలో మిగతా నటీనటులు కూడా తమ పాత్రల మేర ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
ఇన్ని ట్విస్టులు, సస్పెన్స్‌లతో కూడిన కథను హ్యాండిల్ చేయడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. అయినా కూడా దర్శకులు సినిమా నెరేషన్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ఈ సినిమా రన్‌టైమ్‌కు తగ్గట్లుగా దాన్ని పర్ఫెక్ట్‌గా నెరేట్ చేయలేకపోయారు.
కథ ఆకట్టుకునేలా సాగుతున్నా, సాగదీత సీన్స్ కొన్ని ఉండటం.. కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండటం వంటివి సినిమాపై చెడు ప్రభావం చూపించాయి. ఈ విషయంలో జాగ్రత్త పడి ఉంటే ఇలాంటి కథ ఓ పవర్‌ఫుల్ థ్రిల్లర్‌గా నిలిచేది.
ఇలాంటి కథలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేనప్పుడే ఆడియెన్స్‌ను సినిమాలో లీనమయ్యేలా చేయొచ్చు. అయితే, ఈ సినిమాలో అది మిస్ అయ్యింది. ఈ కథను ఇంకాస్త గ్రిప్పింగ్‌గా మలిచి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ ప్లాట్ బాగున్నా, దాన్ని అనవసరంగా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. దీంతో సినిమాలోని సస్పెన్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చివర్లో తేలిపోతుంది.
మందిరా బేడి, ఆదిత్య మీనన్ వంటి పాత్రలు సినిమాకు మైనస్‌గా నిలిచాయి. వారి పాత్రలు పూర్తిస్థాయిలో చూపెట్టలేదు అనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గాన్ని మెచ్చుకోవాల్సిందే. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. కథలోని చాలా సీన్స్ నెరేషన్‌కు తగ్గట్లుగా తీశారు. అయితే, చమన్ చాకో ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. సాగదీత సీన్స్‌తో సినిమా రన్‌టైమ్ ఎక్కువగా అనిపిస్తుంది.
జేక్స్ బిజోయ్ బీజీఎం బాగుంది. సినిమాలోని టెన్షన్ మూడ్‌ని బాగా క్యారీ చేస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ డీసెంట్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ నీట్‌గా ఉంది.
తీర్పు:
ఓవరాల్‌గా ‘ఐడెంటిటీ’ చిత్రం సస్పెన్స్, టెన్షన్ వంటి అంశాలతో ఆకట్టుకునే యాక్షన్ థ్రిల్లర్. అయితే ఈ సినిమాలోని స్లో పేస్, నెరేషన్, సాగదీత రన్‌టైమ్ ప్రేక్షకుల్లో నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. టోవినో థామస్, వినయ్ రాయ్ చక్కటి పర్ఫార్మెన్స్ అందించారు. ఆడియెన్స్‌ను ఆకట్టుకునే మూమెంట్స్ ఉన్నప్పటికీ ఈ చిత్ర కథనం, పేసింగ్ వంటి అంశాల వల్ల ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ఓపిక తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ చూసే వారిని ‘ఐడెంటిటీ’ కొంతమేర ఆకట్టుకోవచ్చు. ఈ సినిమాను చూడాలనుకునే వారు తక్కువ అంచనాలు పెట్టుకుంటే బెటర్.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team