ఇప్పుడు మన ఇండియన్ సినిమా దగ్గర కూడ ఒకే దర్శకుడు సంబంధించి ఇంట్రెస్టింగ్ సినిమాల కలయికలో ఒక సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ బాగా పాపులర్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాటిక్ యూనివర్స్ లు లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి రెండు వేరే సినిమాల మేకర్స్ కోలీవుడ్ నుంచి ఒకటి, బాలీవుడ్ నుంచి కూడా ఒకటి అలాగే కన్నడ సినిమా నుంచి కూడా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ ఐడియా మావెరిక్ దర్శకుడు ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ కి ఎప్పుడో వచ్చిందట. తన భారీ చిత్రం “రోబో” తెరకెక్కిస్తున్న సమయంలో తనకి ఒక ఐడియా వచ్చిందట. అప్పటికే చేసిన “శివాజీ” లో రజినీకాంత్ అలాగే “ఒకే ఒక్కడు” హిందీ వెర్షన్ హీరో అనీల్ కపూర్ పాత్ర ఇంకా భారతీయుడు నుంచి కమల్ పోషించిన సేనాపతి మూడు పాత్రలు కలిస్తే ఎలా ఉంటుందో అనే ఐడియా ని తన అసిస్టెంట్స్ కి చెప్పానని తెలిపారు.
కానీ వారి నుంచి ఆ ఐడియా కి మంచి ఫీడ్ బ్యాక్ రాకపోవడం అప్పట్లో ఈ తరహా సినిమాలకి బడ్జెట్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు మూలాన ఐడియా గానే మిగిలిపోయింది అని తెలిపారు. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ సినీ వర్గాల్లో ఇప్పుడు మంచి వైరల్ గా మారింది. అయితే ఒకవేళ శంకర్ నుంచి కానీ ఇదే సినిమాటిక్ యూనివర్స్ పడి ఉంటే మాత్రం అప్పట్లోనే ఇండియన్ సినిమా ఇంకోలా ఉండి ఉండేదేమో అని చెప్పాలి.