“కల్కి”: టాక్ పడితే 1000 కోట్లు ఈజీ.. పీజీ..!?

“కల్కి”: టాక్ పడితే 1000 కోట్లు ఈజీ.. పీజీ..!?

Published on Jun 25, 2024 4:50 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏకైక సినిమా ఏదన్నా ఉంది అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన చిత్రం “కల్కి 2898 ఎడి” అనే చెప్పాలి. మరి ఈ సినిమా పై హైప్ తార స్థాయిలోకి వెళుతుండగా ఇండియా వైడ్ గా మాత్రమే కాకుండా సినిమా ఎక్కడెక్కడ విడుదల అవుతుందో అన్ని ప్రాంతాల్లో కూడా గతంలో ఏ సినిమాకి కూడా రాని భారీ స్థాయి బుకింగ్స్ కనిపిస్తున్నాయి.

టికెట్స్ ఇలా ఓపెన్ చేయగానే యిట్టె అమ్ముడుపోతున్నాయి. మరి ఈ ఊపులో సినిమాకి కానీ పర్ఫెక్ట్ పాజిటివ్ టాక్ పడితే మాత్రం కల్కి సినిమాకి 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకోవడం పెద్ద పనేం కాదనే చెప్పాలి. ఇప్పటీకే మొదటి రోజు 200 కోట్ల గ్రాస్ వచ్చినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.

మెయిన్ గా ఇండియన్ సినిమా నుంచి మునుపెన్నడూ చూడని స్పెషల్ సబ్జెక్టు ని దర్శకుడు నాగ్ అశ్విన్ పట్టుకోవడం అందుకు తగ్గట్టుగా భారీ తారాగణం కమల్ (Kamal Haasan), అమితాబ్ (Amitab Bachchan), దీపికా (Deepika Padukone), దిశా వీరితో పాటుగా విజువల్ ఎఫెక్ట్స్ ఆ ట్రైలర్ కట్స్ వంటివి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసాయి. మరి వీటితో ఈ సినిమా ఆ మాసివ్ మార్క్ ని కల్కి మంచి టాక్ పడితే సునాయాసంగా అందుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు