మన సౌత్ సినిమా దగ్గర ఎన్నెన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు అందించిన లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా కోసం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ కూడా అదే రీతి అద్భుతమైన గీతాలని తాను అందిస్తుండగా ఈ మధ్య కాలంలో వీటితో పాటుగా మరికొన్ని అంశాల్లో తాను హైలైట్ అవుతున్నారు. తాను ఇచ్చిన ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ ని ప్రస్తుత తరం యువ దర్శకులు తమ సినిమాల్లో అభిమానంతో మంచి వైబ్ కోసం పెడుతున్నారు.
కానీ ఇదే వారికి చిక్కులు తెస్తుంది. ఇలా లేటెస్ట్ గా అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో కూడా జరిగింది. తన ట్యూన్ అనుమతి లేకుండా వాడినందుకు తనకి 5 కోట్లు ఆ చిత్ర యూనిట్ చెల్లించాలి అని ఇళయరాజ ఊహించని షాకిచ్చారు. దీనితో ఈ వార్త సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. మరి దీనిని మేకర్స్ ఎలా సెటిల్ చేస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఈ చిత్రం భారీ వసూళ్లు అందుకొని దూసుకెళ్తుంది.