ఇళయదళపతి విజయ్ 67 మూవీ టైటిల్ రివీల్ డేట్, టైం ఫిక్స్

ఇళయదళపతి విజయ్ 67 మూవీ టైటిల్ రివీల్ డేట్, టైం ఫిక్స్

Published on Feb 2, 2023 9:34 PM IST


ఇటీవల వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన వారసుడు మూవీ ద్వారా బిగ్గెస్ట్ సక్సెస్ సొంతం చేసుకున్న ఇళయదళపతి విజయ్ కెరీర్ పరంగా మంచి జోష్ మీదున్నారు. ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తన కెరీర్ 67వ మూవీ చేయడానికి విజయ్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. త్రిష కథానాయికగా నటించనున్న ఈ ప్రతిష్టాత్మక మూవీలో సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అర్జున్ సర్జా వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించనుండగా అనిరుద్ సంగీతం అందించనున్నారు.

ఇక మొదటి నుండి కూడా ఈ క్రేజీ ప్రాజక్ట్ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా సెవన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో రూపొందనున్న ఈ మూవీ యొక్క టైటిల్ ని రేపు సాయంత్రం 5 గం. లకు అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అనౌన్క్ చేసారు. మొత్తంగా అందరిలో మంచి హైప్ ఏర్పరిచిన ఈ మూవీ త్వరలో పట్టాలెక్కి, ఆపై రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు