సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బుట్టబొమ్మ. అనికా సురేంద్రన్ తో పాటు అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక నేడు ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా నిర్వహించగా యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక అతిథిగా విచ్చేసారు.
ఈ సందర్భంగా హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ, నిజానికి ఈ సినిమా తాను చేయాల్సిందని అయితే కొన్ని కారణాల వలన చేయలేకపోయానని అన్నారు. ఇక బుట్టబొమ్మ మూవీలో కథే హీరో అని, ఆ విధంగా కథ, కథనాలు మనల్ని ఎంతో ఆకట్టుకోవడంతో పాటు పాత్రలకు మనల్ని చేరువ చేస్తుందని అన్నారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ అంటే తన సొంత బ్యానర్ వంటిదని, తనని ఈ వేడుకకి అతిథిగా ఆహ్వానించిన నాగవంశీ గారికి, అలానే బుట్టబొమ్మ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ కి ముందస్తుగా అభినందనలు తెలియచేస్తున్నారు తెలిపారు. డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ, గతంలో సుకుమార్ గారి వద్ద పనిచేసిన అనుభవం బుట్టబొమ్మ మూవీకి ఎంతో పనికొచ్చిందని అన్నారు.
ఇక ఈ మూవీ లాక్ డౌన్ టైం లో చూశానని, దీనిని తెలుగులో తీయాలనే ఆలోచన తనకు రావడం, అదే టైం లో నవీన్ నూలి గారు తనని వంశీ గారికి, చినబాబు గారికి పరిచయం చేయడం, ఈ సినిమా గురించి నా విజన్ చెప్పడంతో వారికీ ఎంతో నచ్చి ఈ అవకాశం ఇచ్చారని అన్నారు. సినిమా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది, ఆ విధంగా ప్రతి ఒక్క నటీనటులు, టెక్నీషియన్స్ ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారని అన్నారు. హీరోయిన్ అనికా సురేంద్రన్ మాట్లాడుతూ, నాకు ఇంత మంచి అవకాశం అందించిన సితార ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారికి అలానే దర్శకుడు రమేష్ గారికి థాంక్స్ అని అన్నారు.
అర్జున్ దాస్, సూర్య లతో వర్క్ చేయడం ఎంతో మంచి అనుభూతిని కలిగించిందని, తప్పకుండా మూవీ మీ అందరికీ నచ్చుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేసారు. నటుడు సూర్య వశిష్ట మాట్లాడుతూ, నేను ఈ రోజు ఇక్కడ ఉండడానికి కారణం మా నాన్నగారు. లాక్ డౌన్ టైం లో ఆయన ఈ మూవీ మలయాళ వర్షన్ చూపించి ఇందులోని ఆటోడ్రైవర్ పాత్ర నువ్వు చేస్తే బాగుంటుందని అన్నారు. అయితే ఆ తరువాత ఆయన కోవిడ్ వల్ల చనిపోయారు. అయితే ముందుగా ఈ సినిమాని సిద్దు గారు, విశ్వక్ సేన్ గారితో వంశీ అన్న నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
అయితే అనంతరం త్రివిక్రమ్ గారిని కలవడంతో ఈ పాత్రకు నువ్వు సరిపోతావు వెళ్లి ఆడిషన్ ఇవ్వమని చెప్పడం, ఆ తరువాత ఆడిషన్ లో నేను సెలెక్ట్ అవడం జరిగిందన్నారు. రమేష్ గారితో వర్క్ చేయడం మంచి అనుభూతి, ఇక అర్జున్ దాస్, అనికా లతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేను, తప్పకుండా మూవీ మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు. అనంతరం ఈ మూవీ డైరెక్టర్ మారుతీ, అనుదీప్, సంపత్ నంది, శైలేష్ కొలను వంటి యువ దర్శకులు మాట్లాడుతూ తప్పకుండా బుట్టబొమ్మ మీ అందరినీ అలరించాలని కోరుతూ టీమ్ కి ముందస్తు అభినందనలు తెలియచేసారు. కాగా ఈ మూవీ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకి రానుంది.