సమీక్ష : ఇన్ కార్ – బోరింగ్ అండ్ సిల్లీ క్రైమ్ డ్రామా !

సమీక్ష : ఇన్ కార్ – బోరింగ్ అండ్ సిల్లీ క్రైమ్ డ్రామా !

Published on Mar 4, 2023 3:02 AM IST
In Car Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 03, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: రితిక సింగ్, సందీప్ గోయట్, మనీష్ జంజోలియా, గ్యాన్ ప్రకాశ్, సునీల్ తదితరులు

దర్శకుడు : హర్ష వర్ధన్

నిర్మాతలు: అంజుమ్ ఖురేష్, సాజిద్ ఖురేషి

సంగీత దర్శకులు: మథియాస్ డుప్లెస్సీ

సినిమాటోగ్రఫీ: మిథున్ గంగోపాధ్యాయ్

ఎడిటింగ్: మణిక్ దివార్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

కథ :

 

మర్డర్ కేసులో బెయిల్‌ పై విడుదలైన నిందితుడు, అతని అన్న, అలాగే అతని మామ మొత్తం ముగ్గురు (సందీప్ గోయట్, మనీష్ జంజోలియా, సునీల్) తమ వాహనంలో ప్రయాణిస్తుంటారు. అయితే, వారి వెహికల్ ఆగిపోతుంది.
అయితే, అటుగా వెళ్తున్న మరో కారును ఆపి, ఆ డ్రైవర్‌ను తుపాకితో బెదిరించి తమ వెంట తీసుకెళ్తారు. వెళ్లే దారిలో బస్టాప్‌లో ఉన్న సాక్షి (రితిక సింగ్)ను చూసి కిడ్నాప్ చేస్తారు. ఆ కారులో సాక్షిని బంధించి కోరికలు తీర్చుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు ?, కారులో రితికా సింగ్‌పై వారు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు? ముగ్గురు కిడ్నాపర్ల నుంచి రితికా సింగ్ ఎలా బయట పడింది ?, చివరకు ఆమె ఎలా మారింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో రితికా సింగ్‌ పోషించిన ప్రధాన పాత్ర అయిన సాక్షి పాత్ర.. ఆ పాత్రను కిడ్నాప్ చేసిన ట్రాక్.. అలాగే ముగ్గురు కిడ్నాపర్లు రితికా సింగ్ పై చేసే శారీరిక దాడి.. ఆ దాడి తాలూకు సీన్స్.. ఇలా మొత్తానికి ఇన్ కార్ సినిమా కాన్సెప్ట్ పరంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సస్పెన్స్ టోన్ తో సాగే కొన్ని సీన్స్ అండ్ ఎమోషన్స్ వంటివి బాగానే ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన రితికా సింగ్‌ తన లుక్స్ అండ్ నటనతో ఆకట్టుకుంది. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా ఆమె హావ భావాలు కూడా బాగా అలరించాయి. అలాగే, కీలక పాత్రలో నటించిన సందీప్ గోయట్, మనీష్ జంజోలియా, సునీల్ కూడా చాలా బాగా నటించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు హర్ష వర్ధన్ మంచి స్టోరీ లైన్ తీసుకున్నా.. దాన్ని ఇంట్రెస్టింగ్ ప్లే తో ఆసక్తికరంగా సినిమాని మలచలేక పోయారు. కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కావు. దీనికి తోడు మెయిన్ క్యారెక్టర్ ట్రాక్ కూడా చాలా సింపుల్ గా ఉండటం బాగాలేదు.

కాకపోతే, దర్శకుడు హర్ష వర్ధన్ రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ స్లోగా సాగడం అస్సలు బాగాలేదు. ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. మొత్తానికి ఈ రెగ్యులర్ ఎమోషనల్ వెరీ వెరీ స్లో క్రైమ్ స్టోరీ ఆకట్టుకో లేకపోయింది. దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించలేకపోయాడు.

 

సాంకేతిక విభాగం :

 

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు మథియాస్ డుప్లెస్సీ నేపథ్య సంగీతం బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. ఒక కార్ లోనే న్యాచురల్ విజువల్స్ తో కెమెరామెన్ చాలా సీన్స్ ను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్ర నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

 

‘ఇన్ కార్’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాలో మెయిన్ స్టోరీ లైన్ అండ్ కొన్ని సీన్స్ ఆకట్టుకున్నాయి. కానీ, ఈ సినిమా మాత్రం మెప్పించలేకపోయింది. అయితే, రితికా సింగ్‌ నటన అండ్ కొన్ని భావోద్వేగ సన్నివేశాలు బాగున్నాయి. కానీ, కథ కథనాలు బాగా స్లోగా సాగడం, అలాగే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడం, ఇక సెకండ్ హాఫ్ కూడా బోర్ గా సాగడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని బాగా ల్యాగ్ చేయడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చదు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు