“గేమ్ ఛేంజర్”.. ఆ రెండు సాంగ్స్ ఐడియా శంకర్ దే

“గేమ్ ఛేంజర్”.. ఆ రెండు సాంగ్స్ ఐడియా శంకర్ దే

Published on Jan 8, 2025 8:06 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ని కూడా జోరుగా చేస్తుండగా లేటెస్ట్ గా సంగీత దర్శకుడు థమన్ మాటలు ఇంట్రెస్టింగ్ గా మారాయి.

శంకర్ సినిమాల్లో పాటలు ఏ లెవెల్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. మరి అలాగే గేమ్ ఛేంజర్ లో జరగండి సాంగ్ పైసా వసూల్ సాంగ్ అని తాను అంటున్నాడు. అలాగే ఐమ్యాక్స్ స్క్రీన్ లో అయితే ఈ సాంగ్ అదిరిపోతోంది అంటున్నాడు. ఇక ఈ సాంగ్ లో జరగండి అనే పదం అలాగే ధోప్ సాంగ్ పదం ఐడియాస్ శంకర్ గారివే అని ఆయా రెండు పదాలతో సాంగ్స్ కావాలని అడిగారు అంటూ థమన్ ఇంట్రెస్టింగ్ అంశాలు రివీల్ చేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు