ఇంట్రెస్టింగ్..ఆ రకంగా వరుస 1 బిలియన్ కొట్టిన ఏకైక హీరోగా అల్లు అర్జున్.!

Published on Jan 20, 2022 8:00 am IST

ఒక్క మన టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం ఇండియన్ సినిమాల దగ్గర మ్యూజిక్ అనేది ఎంతలా ప్రభావం చూపుతుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఓ సినిమా రిలీజ్ కి ముందే ఆ సినిమా ఫలితాన్ని సగం ఆ సినిమా మ్యూజిక్ ఆల్బమే డిసైడ్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అలాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్ ఆల్బమ్స్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందుకున్నాడని చెప్పాలి.

స్టైలిష్ స్టార్ గా తన లాస్ట్ సినిమా “అల వైకుంఠపురములో” సినిమా థమన్ సంగీతం ఇచ్చిన ఆల్బమ్ ఎంతటి సెన్సేషన్ ని నమోదు చేసిందో చూసాము. ప్రతి పాట కూడా టాలీవుడ్ నుంచే కాకుండా ఇండియన్ సినిమా దగ్గరే బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయ్యింది. దీనితో ఫస్ట్ 1 బిలియన్ మ్యూజిక్ ఆల్బమ్ ని అల్లు అర్జున్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక దీని తర్వాత స్టార్ట్ చేసిన “పుష్ప” అందులోని ఐకాన్ స్టార్ గా ఫస్ట్ సినిమా మరీ అందులో సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ బన్నీ సినిమా అంటే ఆల్బమ్ పరంగా మరిన్ని అంచనాలు.. దానికి ముందు మరో హ్యాట్రిక్ ఆల్బమ్ బన్నీ – త్రివిక్రమ్ ల సినిమా భారీ హిట్ కావడంతో “పుష్ప” ఆల్బమ్ పై అంచనాలు పీక్స్ లోకి వెళ్లాయి.

మరి ఆ అంచనాలు అన్నిటినీ అందుకుంటూ ఈ ఆల్బమ్ కూడా రీసెంట్ గా 1 బిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇలా ఇద్దరు దర్శకులతో రెండు హ్యాట్రిక్ సినిమాలు, ఐకాన్ స్టార్ గా ఫస్ట్ సినిమా స్టైలిష్ స్టార్ గా లాస్ట్ సినిమాలు ఇలా 1 బిలియన్ తోనే అందుకోవడం మరింత ఆసక్తికరం. మరి ఇదంతా అయితే ఒక్క అల్లు అర్జున్ కే చెల్లిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :