ఆ విషయంలో ఆర్జీవీ తరువాత సందీప్ కే ఆ గట్స్ ఉన్నాయి – ఎస్ ఎస్ రాజమౌళి

ఆ విషయంలో ఆర్జీవీ తరువాత సందీప్ కే ఆ గట్స్ ఉన్నాయి – ఎస్ ఎస్ రాజమౌళి

Published on Nov 28, 2023 3:04 AM IST


సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న కలిసి నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ పాన్ ఇండియన్ థ్రిల్లింగ్ ఎమోషనల్ మూవీ యానిమల్. ఈ మూవీలో అనిల్ కపూర్, బాబీ డియోల్, పృథ్వీరాజ్, త్రిప్తి డిమ్రి, బబ్లూ పృథివీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్, రవి గుప్తా, సిద్ధాంత్ కర్నిక్, సౌరభ్ సచ్‌దేవా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. అందరిలో ఎన్నో భారీ అంచనాలు కలిగిన ఈ మూవీ డిసెంబర్ 1న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

ఇక నేడు హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీ లో జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి గెస్టులుగా విచ్చేసారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, ఇటీవల యానిమల్ టీజర్, ట్రైలర్ చూసిన తనకు ఎంతో బాగా నచ్చాయని అన్నారు. నిజానికి తాను అందరి కంటే ముందుగానే యానిమల్ మూవీని నవంబర్ 30నే చూడబోతున్నట్లు తెలిపారు రాజమౌళి. ఇక టాలీవుడ్ లో గల కొన్ని ఫార్ములాలు, నార్మ్స్ ని బ్రేక్ చేసి గతంలో మూవీస్ తీసిన ఆర్జీవీ తరువాత ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగానే ఇటువంటి మూవీస్ తీస్తున్నారని, తప్పకుండా యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు టీమ్ కి బెస్ట్ విషెస్ తెలియచేసారు రాజమౌళి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు