NBK 109: బాలయ్య సినిమాకి ఈ రెండిట్లో ఏది?


నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కాంబినేషన్ లో చేస్తున్న క్రేజీ మాస్ యాక్షన్ డ్రామా కోసం అందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్లో 109వ సినిమాగా ఇది తెరకెక్కిస్తుండగా ఎన్నో అంచనాలు ఈ చిత్రం పట్ల నెలకొన్నాయి. వరుసగా మూడు భారీ హిట్స్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా ఇది కావడంతో హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉండగా ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది చాలా రోజులు కాదు నెలల నుంచి సస్పెన్స్ గా ఉంది.

అయితే ఫైనల్ గా ఈ టైటిల్ పై ఈ దసరా కానుకగా క్లారిటీ రానుంది అని కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఆ మధ్య చాలా టైటిల్స్ వైరల్ అయ్యాయి. వీరమాస్, హంటర్ అంటూ వినిపించాయి కానీ లేటెస్ట్ గా మరో రెండు ఊపందుకున్నాయి. డాకు మహారాజ్, సర్కార్ సీతారాం అంటూ బయటకి వచ్చాయి. మరి ఇవి ఫ్యాన్స్ లో వైరల్ గా మారగా అసలు టైటిల్ ఏంటి అనేది మేకర్స్ నేడు రివీల్ చేయనున్నారు. మరి భారీ హైప్ లో ఉన్న ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ ని వారు ఫిక్స్ చేశారు అనేది చూడాలి.

Exit mobile version