అన్ని సెంటర్స్ లో “అఖండ” 50 రోజుల మాస్ జాతర.!

Published on Jan 20, 2022 9:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ సినిమా “అఖండ”. బాలయ్య మరియు బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమాగా అందరి అంచనాలు అందుకొని గత ఏడాది క్లీన్ హిట్ గా నిలవడమే కాకుండా మళ్ళీ టాలీవుడ్ లో పాత రోజులని చేసే తరహా హిట్ గా నిలిచిపోయింది.

మరి అలాగే ఈ సినిమా ఒక్క కలెక్షన్ పరంగానే కాకుండా థియేట్రికల్ గా కూడా సాలిడ్ రన్ ని కనబరిచి 50 రోజుల మార్క్ ని అందుకుంది. అయితే ఈ 50 రోజులు మార్క్ కూడా సెన్సేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్ లో ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా జరుపుకోని సెంటర్స్ లో అఖండ 50 రోజుల మాస్ జాతర జరుపుకోబోతుంది.

ఈ సినిమా ఒక్క తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 106 సెంటర్స్ లో 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీనితో ఈ వేడుకల్ని కూడా అభిమానులు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి మాత్రం అఖండ విజయం మరోసారి చరిత్రలో నిలిచిపోయేదిలా మారిందని చెప్పాల్సిందే.

సంబంధిత సమాచారం :