“గేమ్ ఛేంజర్” ఆ రెండు డేట్స్ లో ఒకటి కన్ఫర్మ్?

“గేమ్ ఛేంజర్” ఆ రెండు డేట్స్ లో ఒకటి కన్ఫర్మ్?

Published on Jun 18, 2024 3:01 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి శంకర్ ఎన్నో ఏళ్ళు నుంచి ఈ సినిమా తెరకెక్కిస్తూనే ఉన్నారు. దీనితో రిలీజ్ ఎప్పుడు అనేది చాలా సస్పెన్స్ గా నిలిచిపోగా దిల్ రాజు ఇచ్చిన కన్ఫర్మేషన్ వరకు అయితే ఈ సినిమా అక్టోబర్ ఎండింగ్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

అయితే ఇప్పుడు దీనితో పాటుగా సాలిడ్ బజ్ అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ విషయంలో వినిపిస్తుంది. ప్రస్తుతానికి దిల్ రాజు చెప్పినట్టుగా అక్టోబర్ 31 మొదటి డేట్ గా వినిపిస్తుండగా మరో డేట్ గా అయితే డిసెంబర్ 20 అన్నట్టుగా వినిపిస్తుంది. దీనితో ఈ రెండు తేదీల్లో అయితే గేమ్ ఛేంజర్ రావడం పక్కా అని టాక్. ఆల్రెడీ అఫీషియల్ క్లారిటీ వస్తుంది అని టాక్ ఉంది. మరి ఈ రెండిట్లో మేకర్స్ దేనిని ఫిక్స్ చేస్తారో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు