లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా పాన్ ఇండియా దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేసిన లేటెస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి తెలుగులో “భారతీయుడు 2” గా వచ్చిన ఈ చిత్రం ఏ భాషలో కూడా అనుకున్న రీతిలో విజయాన్ని అందుకోలేదు. అయితే ఈ సినిమాలో నటించిన ప్రధాన తారాగణంలో హీరో సిద్ధార్థ్ తో ఫ్రెండ్ గా కనిపించిన యువ నటి ప్రియా భవాని శంకర్ కూడా ఒకామె.
అయితే ఈ సినిమా విషయంలో ఆమెపై చాలానే ట్రోల్స్ రాగా వాటిపై ఆమె ఎమోషనల్ అయ్యింది. ఖచ్చితంగా తనపై వచ్చిన ట్రోల్స్ మూలాన నేను బాధ పడ్డాను అని రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపింది. ఏ నటి అయినా కూడా శంకర్, కమల్ సర్ లాంటి వారి సినిమాలో ఆఫర్ ని వదులుకోవాలని చూస్తుంది. నా వల్ల డిజప్పాయింట్ అయ్యిన ఆడియెన్స్ కి మాత్రం తాను క్షమాపణలు కోరుకుంటున్నాను అని ఆమె తెలిపింది. దీనితో ప్రియా భవాని శంకర్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.