యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ మరియు దర్శకుడు శంకర్ షణ్ముగం మరోసారి ఇండియన్ 2 చిత్రం కోసం జతకట్టారు. ఈ చిత్రం ఇండియన్ (భారతీయుడు) చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్‌లో కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తోంది. వాస్తవానికి జూన్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేసిన ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం కావడం తో వాయిదా పడనుంది. జూలైలో మళ్లీ షెడ్యూల్ చేయబడిన విడుదలకు దారితీసింది.
ఇండియన్ 2 జూలై 12, 2024న థియేటర్లలో విడుదల కానుందని సోషల్ మీడియా బజ్ సూచిస్తుంది. చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కమల్ హాసన్ మరియు కాజల్ అగర్వాల్‌తో పాటు సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడుగా, లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.