లోక నాయకుడు కమల్ హాసన్ అలాగే యంగ్ హీరో సిద్ధార్థ్ కాంబినేషన్ లో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రమే “ఇండియన్ 2”. కమల్ శంకర్ కాంబినేషన్ లో చేసిన క్లాసిక్ హిట్ చిత్రం ఇండియన్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మాత్రం అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ ని అందుకోలేదు.
శంకర్ తన శక్తి మేరకు ట్రై చేసారు కానీ గత సినిమాలా ఇందులో సరైన సోల్ లేకపోవడంతో ఈ చిత్రం అనుకున్న విజయాన్ని సొంతం చేసుకోలేదు. ఇక థియేటర్స్ లో ఆల్రెడీ సినిమా రన్ అన్ని చోట్లా పూర్తయిపోయింది కానీ ఇప్పుడు సినిమా ఓటిటి రిలీజ్ కి అయితే వచ్చేస్తున్నట్టుగా బజ్ వినిపిస్తుంది.
ఇప్పటికే ఈ చిత్రం నెల లోపే ఓటిటిలో వచ్చేస్తుంది అని టాక్ ఉన్న సంగతి తెలిసిందే. ఇలా మొదటిగా అయితే ఈ సినిమా ఓవర్సీస్ అడియన్స్ కి అందుబాటులోకి తానున్నట్టుగా నయా టాక్. దీనితో ఇండియా కంటే ముందే ఇండియన్ 2 పాశ్చాత్య దేశాల్లో అడుగు పెట్టనున్నాడని చెప్పాలి.
మరి ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రం అందులోనే అందుబాటులోకి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.