మలేషియాకి “ఇండియన్ 2”.. సాలిడ్ ప్రమోషన్స్


ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ చిత్రం కల్కి అదరగొడుతుండగా ఈ చిత్రం తర్వాత ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన లెజెండరీ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన మరో పాన్ ఇండియా సినిమా “ఇండియన్ 2” నెక్స్ట్ బిగ్ రిలీజ్ గా రాబోతుంది. అయితే ఈ చిత్రంని భారీ లెవెల్లో బయట దేశాల్లో కూడా రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా వీటిలో తమిళ సినిమాకి స్ట్రాంగ్ బేస్ అయినటువంటి మలేషియా, సింగపూర్ లలో కూడా పెద్ద ఎత్తున ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

అయితే లేటెస్ట్ గా మేకర్స్ సింగపూర్ ప్రమోషన్స్ కి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అక్కడ పెవిలియన్ బకిట్ జలీల్ లో మొదటగా ప్రెస్ కాన్ఫిరెన్స్ ని పెట్టి మీడియాతో మేకర్స్ ముచ్చటించనుండగా ఈ తర్వాత ఎన్ యూ సెంట్రల్ లో ఫ్యాన్స్ మీట్ లో పాల్గొననున్నారు. మొత్తానికి అయితే ఈ సినిమాకి గట్టి ప్రమోషన్స్ నే శంకర్ ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జూలై 12న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Exit mobile version