‘గేమ్ ఛేంజర్’పై ఆశలు పెట్టుకున్న ఇండియన్..?

‘గేమ్ ఛేంజర్’పై ఆశలు పెట్టుకున్న ఇండియన్..?

Published on Oct 3, 2024 5:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాపై దర్శకుడు శంకర్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ కావడం శంకర్ కంటే కూడా ఇతరులకు ముఖ్యంగా మారింది. ఇంతకీ శంకర్ సినిమా ఆయనకంటే ఎవరికి ముఖ్యం అయ్యిందా అని అభిమానులు చూస్తున్నారు.

కాగా, శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయం సాధిస్తుందా అని ఇండియన్-2 మేకర్స్ చూస్తున్నారు. ఈ సినిమా గనక సక్సెస్ అయితే, తాము తెరకెక్కించే ‘ఇండియన్-3’కి ఊరట లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాను కూడా దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్నాడు. అయితే, గతంలో వచ్చిన ఇండియన్-2 భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా, బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. దీంతో ఈ సినిమాకు భారీ నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

అయితే, ఇండియన్-3 చిత్రాన్ని వారు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చూస్తున్నారట. కానీ, ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ తరువాత ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని వారు భావిస్తున్నారట. దీంతో ఇండియన్-3 మేకర్స్ కూడా ‘గేమ్ ఛేంజర్’పై ఆశలు పెట్టుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు