ఖచ్చితంగా తెలుగు సినిమా కానీ ఇండియన్ సినిమా కోసం గాని ప్రపంచ సినిమా దగ్గర మాట్లాడే ప్రస్తావన వస్తే అది బాహుబలి కి ముందు బాహుబలి కి తర్వాత అనే చెప్పాలి. హీరో ప్రభాస్ ఐదేళ్ల డెడికేషన్ కి అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అండ్ టీం చిత్తశుద్ధికి ఈ సినిమా విజయం ఒక చెరగని మచ్చుతునక.
భారతీయ సినిమా ఎంతో గర్వించదగ్గ విజయాన్ని అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసిన ఇప్పటికీ ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మరి మొదటి భాగం బాహుబలి కి సీక్వెల్ గా వచ్చిన “బాహుబలి 2” నేటితో ఆరు వసంతాలు కంప్లీట్ చేసుకుంది. దీనితో చిత్ర యూనిట్ సహా అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేసుకుంటున్నారు.
దీనితో ఇండియా మొత్తం బాహుబలి 2 పేరు మరోసారి మారుమోగుతోంది. అప్పటి వరకు అన్ని భాషల్లో కూడా సీక్వెల్స్ అంటే ఓ చెడు సంకేతం ఉన్న నేపథ్యంలో ఈ బాహుబలి 2 తో మేకర్స్ ఎంతో మంది ఇతర దిగ్గజ దర్శకులకి సైతం ప్రేరణగా నిలిచారు. అదే విధంగా ఇలాంటి రోజున కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ “పొన్నియిన్ సెల్వన్” సీక్వెల్ కూడా రిలీజ్ కావడం మరో యాదృచ్చికం.
ఇలా ఎన్నో కోణాల్లో బెంచ్ మార్క్ సెట్ చేసిన ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర 28 రాష్ట్రాల్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఇండియాస్ ఇండస్ట్రీ హిట్ గా ఇప్పుడు ఫ్యాన్స్ బిగ్గెస్ట్ ట్రెండ్ ని చేస్తూ బాహుబలి 2 రిలీజ్ డే స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో రాణా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్ తదితరులు ఎన్నో ఐకానిక్ రోల్స్ లో నటించగా కీరవాణి సంగీతం అందించారు. అలాగే ఆర్కా మీడియా వారు ఈ బిగ్గెస్ట్ మూవీని టేకప్ చేసి ఇండియన్ సినిమా దగ్గర గేమ్ ఛేంజింగ్ ప్రొడ్యూసర్స్ గా నిలిచారు.