భార‌తీయుడు.. థియేట‌ర్ల‌ నుండి ఓటిటిలోకి!

భార‌తీయుడు.. థియేట‌ర్ల‌ నుండి ఓటిటిలోకి!

Published on Jul 14, 2024 3:00 AM IST

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన లేటెస్ట్ మూవీ ఇండియ‌న్-2 జూలై 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ట్ చేయ‌డంతో ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అభిమానుల కోసం ఇండియ‌న్ మూవీని ఓటిటిలో స్ట్రీమింగ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అయ్యారు.

అదేంటి.. సినిమా రిలీజ్ అయ్యి రెండు రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ ఏమిటి అనుకుంటున్నారా.? క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఇండియ‌న్-2(తెలుగులో భార‌తీయుడు-2) మూవీ 1996లో వ‌చ్చిన ఇండియ‌న్(భార‌తీయుడు) సినిమాకు సీక్వెల్ అనే సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ సినిమా 4K వెర్ష‌న్ ను జూలై 12న థియేట‌ర్లలో రీ-రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఇండియ‌న్-2 సినిమాను అర్థం చేసుకోవాలంటే తొలుత ఇండియ‌న్ సినిమాను చూడాల్సిందే అని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ అంటోంది.

అంద‌కే.. ఇండియ‌న్ సినిమాను జూలై 15 నుండి ఓటిటిలో స్ట్రీమింగ్ చేస్తున్న‌ట్లు నెట్ ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. దీంతో ఇండియ‌న్ మూవీ ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఇండియ‌న్ మూవీలో క‌మ‌ల్ తో పాటు మ‌నీషా కొయిరాల, ఊర్మిళ త‌దిత‌రులు న‌టించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు