‘ఇండియా బిగ్గెస్ట్ సాంగ్’ను లోడ్ చేస్తున్న క‌ల్కి!

‘ఇండియా బిగ్గెస్ట్ సాంగ్’ను లోడ్ చేస్తున్న క‌ల్కి!

Published on Jun 14, 2024 2:59 PM IST

‘కల్కి 2898 AD’ మూవీ కోసం ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాయ‌డం ఖాయ‌మని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్ర‌మోష‌న్స్ లో కల్కి టీమ్ ఫుల్ బిజీగా ఉన్నారు.

ఇప్ప‌టికే ట్రైల‌ర్ ను కూడా లాంచ్ చేసిన మేక‌ర్స్, ఈ సినిమాలోని పాట‌ల‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ పై అప్డేట్ ఇచ్చిన క‌ల్కి టీమ్, తాజాగా మ‌రో అప్డేట్ ఇచ్చింది. “ఇండియా బిగ్గెస్ట్ సాంగ్ లోడ్ అవుతోంది” అంటూ ఓ స‌రికొత్త పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ లో ఇద్ద‌రు వ్య‌క్తులు చేతులు క‌లుపుతున్నట్లు చూపెట్టారు. దీంతో ఈ చేతులు ఎవ‌రివై ఉంటాయా అని అందరూ ఆస‌క్తిగా చూస్తున్నారు.

క‌మ‌ల్ హాస‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా ప‌దుకొనె, దిశా ప‌టాని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న క‌ల్కి చిత్రానికి సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను నాగ్ అశ్విన్ విజువ‌ల్ వండ‌ర్ మూవీగా రూపొందించ‌గా, వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తోంది. జూన్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల్కి భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు