యూఎస్ లో “ఇంద్ర” రీ-రిలీజ్ వసూళ్లు ఇవే!

యూఎస్ లో “ఇంద్ర” రీ-రిలీజ్ వసూళ్లు ఇవే!

Published on Aug 25, 2024 7:07 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, దర్శకుడు బీ.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇంద్ర చిత్రం థియేటర్లలోకి మళ్ళీ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మళ్ళీ విడుదల అయిన ఈ సినిమా, మంచి వసూళ్లను రాబట్టింది. యూఎస్ ప్రాంతంలో డే1 భారీగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం 62,011 డాలర్ల వసూళ్లను రాబట్టి రికార్డులను తిరగరాసింది.

కేవలం యూఎస్ ప్రాంతంలోని వసూళ్లు ఇవి కాగా, మిగతా ప్రాంతాల్లో వసూళ్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్స్ గా నటించగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు