“అర్దశతాబ్దం” టీజర్ రిలీజ్ చేసిన ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్.!

Published on Jan 26, 2021 4:38 pm IST

టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర, కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ అలాగే సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టికిరన్ రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “అర్ద శతాబ్ధం”. నవీన్ చంద్ర, సాయి కుమార్ గెటప్స్ కి అద్భుతమైన స్పందన వస్తోంది.

ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ని ఇటీవ‌ల దగ్గుబాటి రానా రిలీజ్ చేశారు. ప్రేక్షకుల్లో దీనికి సూపర్ క్రేజ్ వచ్చింది. తాజాగా బ‌తుక‌మ్మ సంబురాల‌ సంద‌ర్భంగా `పుష్ప‌` పాత్ర లుక్ ని ప్ర‌ముఖ న‌టి శ్రీ‌దివ్య లాంచ్ చేశారు. తాజాగా అర్దశతాబ్దం టీజర్ ను డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేశారు..

ఇక ఈ సందర్భంగా ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ..”అర్దశతాబ్దం” పవర్ ఫుల్ టైటిల్. చాలా బాగుంది. టీజర్ చాలా ఇంట్రెస్టింగా ఉంది. రవీంద్ర టేకింగ్ ఎక్స్ లెంట్ గా ఉంది. ఈ సినిమా సక్సెస్ అయి నిర్మాతలకు మంచి లాభాలు తేవాలని .. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

అలాగే నిర్మాతలు మాట్లాడుతూ.. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సుకుమార్ గారు మా సినిమా టీజర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ఉంది.. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. అన్నారు

ఇక ఈ చిత్రానికి రచన,దర్శకత్వం: రవీంద్ర పుల్లే, నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ, డిఓపి: అష్కర్ (బాయ్ ఫేమ్), సంగీతం: నౌఫల్ రాజా (ఎ.ఐ.ఎస్) ఆర్ట్: సుమిత్ పటేల్, కాస్ట్యూమ్స్: పూజిత తాడికొండ, ఎడిటర్: జె. ప్రతాప్ కుమార్, పాటలు: రెహమాన్, స్టంట్స్ : అంజి, పిఆర్ఓ: సాయి సతీష్. రాంబాబు పర్వతనేని లు వ్యవహరిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :