“బాలయ్య 109” కి “అఖండ” బ్యూటీ!?

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన కెరీర్ 109వ చిత్రాన్ని అయితే దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సాలిడ్ యాక్షన్ డ్రామా కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూటింగ్ అయితే ఇపుడు శరవేగంగా పూర్తవుతుంది.

మరి ఇదిలా ఉండగా ఇన్ని రోజులు సినిమా షూటింగ్ అవుతున్నప్పటికీ అధికారికంగా బాలయ్య మినహా ఒక్క బాబీ డియోల్ పై మాత్రమే మేకర్స్ సినిమా కాస్ట్ లో ఉన్నట్టుగా తెలిపారు. అయితే బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా ఉన్నట్టు ఆమె తెలిపింది. కానీ అసలు బాలయ్య సరసన నటించే మెయిన్ హీరోయిన్ ఎవరు అనేది ఇంకా రివీల్ కాలేదు.

అయితే ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరు అనేది రివీల్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్య సెన్సేషనల్ హిట్ చిత్రం “అఖండ” హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ నే నటిస్తున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. లేటెస్ట్ గా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ కూడా బాలయ్య 109 సినిమా షూటింగ్ తో మ్యాచ్ కావడంతో ఈమెనే హీరోయిన్ అన్నట్టుగా ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మరి దీనిపై అయితే అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version