బాలయ్య నెక్స్ట్ కి ఈ అదిరే టైటిల్ పెట్టబోతున్నారా?

Published on Oct 12, 2021 10:03 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే తన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ “అఖండ” షూట్ అంతా కంప్లీట్ చేసేసిన సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీనుతో ప్లాన్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ లైనప్ ని సెట్ చేసుకున్నారని కూడా చెప్పొచ్చు.

వాటిలో దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ ఇంట్రెస్టింగ్ మాస్ సబ్జెక్టు ని బాలయ్య చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇప్పుడు ఈ సినిమా షూట్ స్టార్టింగ్ కు సన్నాహాలు మొదలవుతున్నాయి. అయితే ఈ చిత్రం పై ఇప్పుడు ఓ ఆసక్తికర బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాకి టైటిల్ గా మేకర్స్ అందరికీ బాగా తెలిసిన టైటిల్..

టైటిల్ అనే కన్నా స్లోగన్ అని అంటే బెటర్. దాన్ని పెడుతున్నారట. అది మరేంటో కాదు యూత్ కి బాగా తెలిసిన స్లోగన్ “జై బాలయ్య” అట.. ప్రస్తుతానికి అయితే ఈ టైటిల్ ని మేకర్స్ అనుకుంటున్నారని సినీ వర్గాల్లో టాక్ మరి వాస్తవంగా ఇది ఎంతమేర నిజం అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More