ఇంట్రెస్టింగ్ : ఆ విషయంలో హ్యాట్రిక్ తో బాలకృష్ణ రికార్డు

ఇంట్రెస్టింగ్ : ఆ విషయంలో హ్యాట్రిక్ తో బాలకృష్ణ రికార్డు

Published on Oct 26, 2023 3:01 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన నందమూరి హీరో నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి జోరుతో కొనసాగుతున్నారు. ఇక తాజాగా ఆయన నటించిన భగవంత్ కేసరి మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ప్రభంజనాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీలీల నటించారు. తాజాగా ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకోవడం విశేషం.

అయితే మ్యాటర్ ఏమిటంటే, ఇటీవల బోయపాటి శ్రీనుతో చేసిన అఖండ, అలానే గోపీచంద్ మలినేని తో చేసిన వీరసింహారెడ్డి సినిమాలతో పాటు లేటెస్ట్ గా భగవంత్ కేసరి కూడా రూ. 100 కోట్లు అందుకోవడంతో వరుసగా మూడు సినిమాలు రూ. 100 కోట్లతో హ్యాట్రిక్ కొట్టారు బాలకృష్ణ. కాగా ఈ అరుదైన రికార్డు తమ అభిమాన హీరోకి దక్కడంతో బాలకృష్ణ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు