మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “దేవర”. మరి భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 ని కూడా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పార్ట్ 2 కోసం చాలా మంది ఎదురు చూస్తుండగా ఇప్పుడు సినీ వర్గాల్లో దేవర పార్ట్ 2 కి సంబంధించి ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.
దీనితో దేవర పార్ట్ 2 లో కొరటాల ఇప్పుడు పార్ట్ 1 లో చూపించిన నేపథ్యానికి పూర్తిగా భిన్నమైన బ్యాక్ డ్రాప్ ని ప్లాన్ చేస్తున్నారని అలాగే ఇందులో వచ్చే యాక్షన్ బ్లాక్ లు కూడా అదిరిపోతాయని తెలుస్తోంది. ఇక దీనితో పాటుగా పార్ట్ 2 రావడానికి 2027 ఎండింగ్ లేదా 2028 వరకు ఆగాల్సిందే అన్నట్టు వినిపిస్తోంది. మరి మొత్తానికి అయితే పార్ట్ 2 పట్ల మరిన్ని స్పెషల్ ప్లానింగ్ లు జరుగుతున్నాయని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.