“క్రిష్ 4” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..

ఇండియన్ సినిమా దగ్గర సూపర్ హీరో జానర్ సినిమాలు ఒకింత తక్కువే అని చెప్పాలి. కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ జానర్ లో సినిమాలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే తెలుగు ఆడియెన్స్ కి ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పుడు నుంచో పరిచయం ఉన్న క్రేజీ సూపర్ హీరో ఆ సినిమా ఏదన్నా ఉంది అంటే అది “క్రిష్” అని చెప్పొచ్చు.

ప్రస్తుతం ఉన్న మిడ్ ఏజ్ యువత అంతా ఈ క్రిష్ సినిమా చూసి వచ్చినవారే.. అయితే ఈ సిరీస్ లో మొత్తం మూడు సినిమాలు రాగా నాలుగో సినిమా కోసం దాదాపు దశాబ్ద కాలం నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఓ పక్క హృతిక్ తండ్రి సినిమా దర్శకుడు రాకేష్ రోషన్ సాలిడ్ సబ్జెక్టుని సీక్వెల్ కోసం లాక్ చేసినట్టుగా కూడా టాక్ ఉంది.

అయితే ఇపుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు తెలుస్తుంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ చేస్తున్న “వార్ 2” తర్వాతే ఈ సినిమాలోకి తాను జాయిన్ కానున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ 2025 ప్రథమార్ధం లోనే హృతిక్ తన అవైటెడ్ సూపర్ హీరో సినిమాలో జాయిన్ అవ్వనున్నట్టుగా ఇపుడు టాక్. మరి ఈ క్రేజీ సీక్వెల్ పై మరింత సమాచారం రావాల్సి ఉంది.

Exit mobile version