ఇంట్రెస్టింగ్.. మహేష్ సినిమా టైటిల్ ఇదేనా

Published on May 4, 2021 6:09 pm IST


మహేష్ బాబు సినిమా అంటే టైటిల్ నుండే విపరీతమైన అంచనాలు మొదలైపోతాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం అంటే టైటిల్ ఆషామాషీగా ఉండదు. సినిమా కథను, హీరో పాత్రను ప్రతిబింబించేలా ఉంటుంది టైటిల్. అందుకే వీరిద్దరి కలయికలో మొదలుకానున్న కొత్త ప్రాజెక్ట్ టైటిల్ విషయంలో పెద్ద చర్చే నడుస్తోంది. త్రివిక్రమ్ ఈసారి మహేష్ కోసం ఒక స్టైలిష్ యాక్షన్ డ్రామా రాశారని సినీ వర్గాల్లో టాక్. అంతేకాదు దీనికి చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.

అదే ‘పార్థు’. పార్థు అనగానే మహేష్, త్రివిక్రమ్ కలిసి చేసిన ‘అతడు’ సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో మహేష్ పాత్ర పేరు పార్థు. మహేష్ చేసిన క్యారెక్టర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అది. ఆ పాత్ర ద్వారానే మహేష్ బాబులోని అసలు సిసలు పెర్ఫార్మర్ బయటకొచ్చాడు. మౌనంగా ఉంటూనే కావాల్సినంత హీరోయిజాన్ని చూపించిన క్యారెక్టర్ అది. అందులో మహేష్ బాబు ఒదిగిపోయి నటించారు. ఇప్పుడు ఆ పాత్ర పేరునే తమ కొత్త సినిమా పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమై టైటిల్ ‘పార్థు’ అనే పేడితే అభిమానుల నుండి నూటికి నూరు మార్కులు పడ్డట్టే.

సంబంధిత సమాచారం :