“రానా నాయుడు” సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

“రానా నాయుడు” సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Jun 6, 2024 8:31 PM IST

అప్పటి వరకు వెంకీ మామ అంటే మంచి ఫ్యామిలీ హీరో సాఫ్ట్ గా ఉంటారు అనుకునేవారు అందరికీ కూడా ఒక ఊహించని లెవెల్ షాక్ ని ఇచ్చిన సిరీస్ “రానా నాయుడు”. దగ్గుబాటి యంగ్ హీరో రానా కూడా ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఓటీటీలో నెగిటివ్ టాక్ లో కూడా సాలిడ్ హిట్ అయ్యింది. దీనితో వెంకీ మామ, రానాల ఓటీటీ ఎంట్రీ ఒక బ్లాస్ట్ లా జరిగింది.

అయితే ఈ సిరీస్ కి సీక్వెల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ వారు ఈ సీక్వెల్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ ఇప్పుడు సీజన్ 2 తర్వాత సీజన్ 3 కి కూడా నెట్ ఫ్లిక్స్ వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ సాలిడ్ సిరీస్ కి మొత్తం రెండు సీక్వెల్ లు రాబోతున్నాయి అని చెప్పాలి. అయితే ప్రస్తుతం సీజన్ 2 షూటింగ్ పనులు జరుగుతుండగా రానా, వెంకటేష్ లు జాయిన్ కానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు