SSMB29: మహేష్, జక్కన్న భారీ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

SSMB29: మహేష్, జక్కన్న భారీ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Sep 26, 2024 5:05 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో భారీ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రాబోతుంది. మరి రాజమౌళితో ఎప్పుడు నుంచో అనుకుంటున్న ఈ చిత్రం ఎట్టకేలకి సెట్ అయ్యి పాన్ వరల్డ్ లెవెల్ హైప్ ని సెట్ చేసుకుంది.

అయితే ఈ సినిమా ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం అభిమానులకి క్లారిటీ లేదు. ఇంకో పక్క మహేష్ బాబు సరికొత్త మేకోవర్ అయితే ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ ప్రాజెక్ట్ నటీ నటుల ఎంపిక ఏంటి అనేది దాదాపు క్లియర్ అయ్యిపోయిందట.

మహేష్ సహా సినిమాలో కనిపించే నటీనటుల లిస్ట్ ని జక్కన్న ఫైనల్ చేసేసారట. ఇలా ప్రతి అంశంలో రాజమౌళి అయితే పక్కా క్లారిటీగా సినిమా పనులు చేసేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాలో వరల్డ్ వైడ్ గా చాలా మంది ప్రముఖుల పేర్లే వినిపిస్తున్నాయి. మారిలో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు